Fake GST : రూ.700 కోట్ల ఫేక్ జీఎస్టీ బిల్లింగ్ స్కాం.. ఎలా జరిగిందంటే .. ?

by Hajipasha |
Fake GST : రూ.700 కోట్ల ఫేక్ జీఎస్టీ బిల్లింగ్ స్కాం.. ఎలా జరిగిందంటే .. ?
X

దిశ, నేషనల్ బ్యూరో : దాదాపు రూ.700 కోట్లు విలువైన ఫేక్ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని మండీ గోవింద్‌ఘర్ పట్టణం కేంద్రంగా మనీశ్, అమిత్ సోదరులు నడుపుతున్న ఈ మాఫియా గుట్టును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలీజెన్స్ (డీజీజీఐ) విభాగం రట్టు చేసింది. ఈనెల 9నే మనీశ్, అమిత్‌లను అరెస్టు చేసింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున వారిద్దరికి విధించే జ్యుడీషియల్ కస్టడీ గడువును కోర్టు మరింత పొడిగించింది. తప్పుడు గుర్తింపు పత్రాల ఆధారంగా పెద్దసంఖ్యలో డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేయించి.. వాటి పేరిట ఫేక్ ఇన్‌వాయిస్‌లు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్స్‌ను తయారు చేసే వారని డీజీజీఐ దర్యాప్తులో గుర్తించారు.

ఇలాంటి యాక్టివిటీ వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.100 కోట్ల మేర జీఎస్టీ పన్ను నష్టం జరిగిందని వెల్లడైంది. ఈవిధంగా మోసపూరిత చర్యల ద్వారా జీఎస్టీని ఎగవేయగా.. మిగిలే ధనాన్ని పంజాబ్‌లోని 7 వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల (ఏపీఎంసీ) బ్యాంకు ఖాతాల్లోకి మనీశ్, అమిత్ సోదరులు పంపేవారట. ఆయా అకౌంట్ల నుంచి ఇప్పటివరకు ఈ సోదరులు రూ.717 కోట్లను విత్ ‌డ్రా చేశారని అధికార వర్గాలు తెలిపాయి. మనీశ్, అమిత్ సోదరుల నివాసాలు, ఆఫీసులపై డీజీజీఐ అధికారులు రైడ్స్ చేశారు. 11 మొబైల్ ఫోన్లు, 7 పెన్ డ్రైవ్‌లు, రెండు లాప్‌టాప్‌లు, వివిధ బ్యాంకుల 56 చెక్ బుక్స్, 46 ఏటీఎం కార్డ్స్, ఏడు స్టాంపులు, 27 గుర్తింపు కార్డులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed