- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Telangana Floods: కారు కొట్టుకుపోయిన ఘటనలో మరో మృతదేహం లభ్యం
దిశ, డైనమిక్ బ్యూరో: ఆకేరు వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. నిన్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగుడెం వద్ద ఆకేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి ఒక్కసారి వరద ఉదృతి పెరగడంతో ఆ ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. కారులో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్వినీ ఆమె తండ్రి మోతీలాల్ ఉన్నారు. వీరు ఇరువురు హైదరాబాద్ బయలుదేరి వెళుతుండగా ఘటన జరిగింది.
ఇందులో అశ్వినీ మృతదేహాం ఆదివారం ఆకేరు వాగు దగ్గరలోని ఓ పాయిల్ తోటలో దొరికింది. తండ్రి మోతీలాల్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం గ్రామ శివారులో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహం కారులో కొట్టుకుపోయిన మోతీలాల్ గా గుర్తించారు. మోతీలాల్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతుడి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.