- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
disha effect : దిశ ఎఫెక్ట్..డ్రైనేజీల పరిశుభ్రం..
దిశ ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ లో రోడ్డుపై పారుతున్న మురుగు, డ్రైనేజీల అస్తవ్యస్తం అనే కథనాలతో దిశలో మంగళ, బుధ వారాల్లో ప్రచురితమైన కథనాలకు ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గురువారం స్పందించారు. దీపావళి పర్వదినం రోజు కూడా రోడ్డుపై పారుతున్న మురుగును, అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి..చెత్తా చెదారాలతో నిండుకున్న డ్రైనేజీలను పరిశుభ్రం చేయించారు. ఆర్మూర్ మున్సిపల్ ఆరో వార్డు శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారి ప్రక్కన ఫిష్ మార్కెట్ పక్క రోడ్డులో రోడ్డుపై పారుతున్న మురుగునీరు, పిచ్చి మొక్కలతో కమ్ముకుని చెత్తాచెదారాలతో నిండుకున్న డ్రైనేజీలతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్న దిశ కథనాలకు ఆర్మూర్ మున్సిపల్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజు స్పందించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పంపించి రోడ్డుపైకి వస్తున్న మురుగునీరును రాకుండా పనులు చేశారు. దీపావళి పర్వదినం రోజు మున్సిపల్ చైర్ పర్సన్ మున్సిపల్ కమిషనర్లు స్పందించి.. రోడ్డుపై పారుతున్న మురుగునీరు రాకుండా పనులు చేపట్టి, అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీలను పరిశుభ్రం చేయించడం పట్ల ఫిష్ మార్కెట్ ఏరియాలో గల 6 వ వార్డ్ శివారు కాలనీ లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ముందు భవిష్యత్తు రోజుల్లో సైతం కనీసం నెలకు రెండు సార్లు అయినా ఈ డ్రైనేజీలను సానిటేషన్ ఇన్స్పెక్టర్ గజనాన్ పరిశుభ్రం చేయించాలని ప్రజలు కోరారు.