- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లడఖ్‌లో మార్స్‌ను సృష్టిస్తున్న ఇస్రో! ఫస్ట్ అనలాగ్ మిషన్
దిశ, నేషనల్ బ్యూరో: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. భవిష్యత్‌లో చేపట్టే మానవసహిత అంతరిక్ష ప్రయోగాల కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా లడఖ్‌లోని లేహ్‌లో తొట్టతొలి అనలాగ్ మిషన్‌ను ప్రారంభించింది. ఆకా స్పేస్ స్టూడియో, ఐఐటీ బాంబేల భాగస్వామ్యంతో ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్‌ఫ్లైట్ సెంటర్ ఈ ప్రయోగం చేపడుతున్నది. భూగ్రహం వెలుపల బేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తే ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అవలోకనం చేసుకుని, ఆ సవాళ్లను ఎదుర్కొనేలా సంసిద్ధత సాధించడానికి ఈ మిషన్ ఉపకరించనుంది. అంతరిక్షంలో మానవ స్వభావం, మానసిక, ప్రవర్తనలో వచ్చే మార్పులను అంచనా వేయడం, రోబోట్స్, టెక్నాలజీ ఎలా ప్రభావితమవుతుందని వంటి వివరాలనూ ఈ మిషన్‌లో శాస్త్రవేత్తలు తెలుసుకుంటారు. గగన్‌యాన్ వంటి భారత్ భావి ప్రయోగాలకు ఈ మిషన్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించనుంది.
పొడి వాతావరణం, కొండలు, లోయలు, ఎత్తైన ప్రాంతంలో ఉండటం వంటి లేహ్ పరిస్థితులను మార్స్, చంద్రుడిపై ఉన్న పరిస్థితులతో పోల్చుతారు. అందుకే ఇక్కడే అనలాగ్ స్పేస్ మిషన్ చేపట్టాలని డాక్టర్ అలోక్ కుమార్ ప్రతిపాదించారు.
నాసా ఏం చెప్పింది?
అంతరిక్షంలోని పరిస్థితులను పోలిన ప్రాంతాల్లో అనలాగ్ మిషన్ చేపడుతారని, అలాంటి పరిస్థితుల్లో మనుషులు, రోబోట్లు ఎలా స్పందిస్తాయని శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు తెలుసుకుంటారని నాసా వివరించింది. స్పేస్ ప్రయోగానికి ముందు ఇలాంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కొత్త టెక్నాలజీలను, రోబోటిక్ ఎక్విప్‌మెంట్లను, వెహికిల్స్, నివాసులు, కమ్యూనికేషన్స్, పవర్ జెనరేషన్స్, కదలికలు, మౌలిక వసతులు, స్టోరేజీ వంటివాటిని పరీక్షిస్తారని తెలిపింది.