- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Additional Commissioner : సమగ్ర వివరాలతో సర్వే చేపట్టాలి
దిశ, వరంగల్ టౌన్: సమగ్ర వివరాలతో సర్వే చేపట్టాలని బల్దియా అదనపు కమిషనర్ జోనా(Baldia Additional Commissioner Jona) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 6 నుంచి 18 వరకు నిర్వహించనున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే నిర్వహించనున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలో గల బల్దియా పరిధి ప్రాంత (కాశీ బుగ్గ సర్కిల్) వార్డులలో సర్వే నిర్వహించి ఎన్యుమనేటర్లకు పోచమ్మ మైదాన్ అబ్నూస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు డిప్యూటీ కమిషనర్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ కమిషనర్ ఆదేశాల మేరకు సర్వేలో పాల్గొనే ఎన్యుమనేటర్లకు శిక్షణ అందించడం జరుగుతుందని ఇందుకోసం ఎంపికైన మున్సిపల్ సిబ్బంది రిసోర్సు పర్సనల్ అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు మున్సిపల్ బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లకు శిక్షణ అందజేయడం జరుగుతుందని ఇందుకోసం ప్రభుత్వం రూపొందించిన 73 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి పై సంపూర్ణ అవగాహన కల్పించుకొని సమగ్ర సమాచారంతో సర్వే నిర్వహించాలని ఇందుకోసం ప్రతి ఎన్యుమరేటర్ వారికి కేటాయించిన గృహాల సంబంధిత సమాచార జాబితాను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వోలు షహజాది బేగం, శ్రీనివాస్, సూపరిండెంట్ హబీబ్, టీఎంసీ రమేష్, ఐటీ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.