తెలంగాణలో త్వరలో ఎన్నికల నగారా.. ఈ నెల 6 లేదా 7న షెడ్యూల్ రిలీజ్..?

by Javid Pasha |   ( Updated:2023-10-03 11:30:26.0  )
తెలంగాణలో త్వరలో ఎన్నికల నగారా.. ఈ నెల 6 లేదా 7న షెడ్యూల్ రిలీజ్..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో త్వరలో ఎన్నికలకు నగారా మోగనుంది. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర పర్యటనకు వచ్చారు. 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల సన్నద్దతమై రాష్ట్ర అధికారులతో సమీక్షించనున్నారు. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 5వ తేదీ తర్వాత ఏ క్షణమైనా రావొచ్చని అంటున్నారు. 5వ తేదీ సాయంత్రం రాష్ట్ర పర్యటనకు వచ్చిన అధికారులు ఢిల్లీ వెళ్లిన తర్వాత సీఈసీకి ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు.

తెలంగాణకు ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లపై నివేదిక సమర్పించనున్నారు. దీంతో 6 లేదా 7న ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో కూడా అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో ఈసారి కూడా అక్టోబర్‌లో వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలన్నీ ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ మూడు రోజుల వ్యవధిలోనే రెండు రోజులు తెలంగాణలో పర్యటించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ కూడా దాదాపు అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇక బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.

టీ కాంగ్రెస్ త్వరలోనే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశముంది. ఇక బీఎస్పీ మంగళవారం తొలి జాబితాను ప్రకటించనుంది. అయితే వైఎస్ షర్మిల మాత్రం సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమని వార్తలు రాగా.. ఇప్పటివరకు అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు. రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌టీపీ విలీనం దాదాపు ఖాయమవ్వగా.. వైఎస్ షర్మిల రోల్ ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నారు. దీని వల్ల విలీన ప్రక్రియ ఆలస్యమవుతుందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed