ఎడ్ సెట్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు.. చివరి తేదీ అదే!

by Satheesh |   ( Updated:2023-04-26 14:49:18.0  )
ఎడ్ సెట్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు.. చివరి తేదీ అదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎడ్ సెట్-2023 దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించారు. మే 1వ తేదీ వరకు అప్లికేషన్లకు ఛాన్స్ కల్పిస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 1 వరకు అప్లై చేసుకోవచ్చని.. జనరల్, బీసీ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 ఫీజుతో అప్లికేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ పరీక్ష దరఖాస్తు గడువును రెండు సార్లు పెంచగా తాజాగా మరోసారి పొడిగించారు. మే 18వ తేదీన ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి:

NIRDPR హైదరాబాద్‌లో 141 యంగ్ ఫెలో ఖాళీలు

Advertisement

Next Story