తెలంగాణలో 'డీఎంకే పార్టీ'.. అధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్

by Nagaya |
తెలంగాణలో డీఎంకే పార్టీ.. అధ్యక్షుడిగా ఓయూ ప్రొఫెసర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తెలంగాణలోనూ విస్తరించాలనుకుంటున్నది. దీంతో తెలంగాణ డీఎంకే పార్టీ శాఖను ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ విమోచన దినం సెప్టెంబరు 17వ తేదిన దీన్ని ప్రకటించనున్నారు. మరోవైపు ఇదే రోజు సంఘ సంస్కర్త పెరియార్​జన్మదినం కావడంతో సెంటిమెంట్​ఉంటుందనే ఉద్దేశ్యంతో డేట్​ఫిక్స్​చేసేశారు. ఇప్పటికే ఇక్కడి పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, విధానాలను తెలుసుకున్న డీఎంకే అగ్రనాయకత్వం, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను సంప్రదిస్తున్నది. క్షేత్రస్థాయిలో ఓ సర్వే చేపించి రిపోర్టు కూడా తయారు చేసింది. ఆ మేరకు విధి విధానాలను ముందుకు తీసుకువెళ్లనున్నది.

అధ్యక్షుడిగా ప్రొఫెసర్ గాలి వినోద్​కుమార్..

ఉస్మానియా ప్రొ.గాలి వినోద్​కుమార్​పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్నారు. ఆయనకే డీఎంకే పార్టీ తెలంగాణ శాఖను అప్పగించనున్నారు. జనవరి 2023 లో ఆయన వీఆర్ఎస్​అమలైన మరుక్షణమే పూర్తి స్థాయి ప్రెసిడెంట్‌గా మారనున్నారు. అప్పటి వరకు ఇంచార్జీగా ఉంటూ పార్టీ బలోపేతం కొరకు ప్రత్యేక కార్యచరణ, కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనాయకత్వం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయింది. రాజకీయ పరిస్థితులు, ప్రజలు తీరు, గెలుపు ఓటమీ సాధ్యసాధ్యాలు, పార్టీ బలోపేతం వంటి విషయాలపై చర్చించారు. ఉస్మానియా యూనివర్సిటీలో మంచి గుర్తింపు కలిగిన ప్రొఫెసర్​కావడంతో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మంచి లీడర్లను తయారు చేయగల సత్త ఆయనలో ఉన్నదని డీఎంకే హై కమాండ్​ భావిస్తున్నది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రొఫెసర్లలో ఆయన మూడో వ్యక్తి కానున్నారు. మొదట ప్రొ కోదండరాం, సెకండ్​ప్రొ.ఎస్​సింహద్రి, థర్డ్​వినోద్​కుమార్​నిలిచారు.

72 మందికి శిక్షణ

ఎప్పట్నుంచో ఓ పార్టీ పెట్టాలని ఇంట్రస్ట్​ కలిగిన ప్రొఫెసర్ గాలి వినోద్​కుమార్ గత కొన్ని రోజులుగా సదరన్​ పొలిటికల్​అకాడమీ పేరిట 72 మంది అభ్యర్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. రాజ్యంగం, చట్టాలు, నాయకత్వ లక్షణాలు, ఓటు విలువ, అంబేద్కర్, పూలే, సిద్ధంతాలు, ఎలక్షన్​కమిషన్​రూల్స్, ప్రజలు పరిస్థితులు, నామినేషన్లు విధానం, వంటి వాటిపై స్వయంగా ఆయనే క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని యువకులతో బలమైన పార్టీని ఏర్పాటు చేయాలని ఆకాంక్షతో ఉన్న ఆయనను ఇటీవల టీడీపీ కూడా ఆశ్రయించింది. 30 మంది పేర్లు ఇచ్చి మీ పార్టీ పేరుతో టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. కానీ దానికి ప్రొఫెసర్ గాలి అంగీకరించలేదు. ఈ విషయం తెలుసుకున్న డీఎంకే పార్టీ హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చి ఆయనను కలిసింది. అయితే బీసీ ముఖ్యమంత్రే ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్లనున్నారు. జనాభా దామాషా ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. 65 సీట్లు బీసీలు, 35 సీట్లు ఎస్సీ, ఎస్టీలు, మిగతావి మైనార్టీలు, అగ్రకులాల్లోని పేదలకు ఇవ్వనున్నట్లు ఆయన 'దిశ'కు చెప్పారు. వీటిలో 50 శాతం మహిళా రిజ్వరేషన్లు తప్పనిసరిగా ఉంటుందన్నారు. 2023 ఎన్నికల్లో 119 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో పోటీ చేసేందుకు పూర్తి స్థాయి సంసిద్ధంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed