- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: గవర్నర్ తమిళి సై నిర్ణయంతో డైలమాలో డీఎంఈ..!
దిశ, తెలంగాణ బ్యూరో: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని హెచ్‌వోడీల ఏజ్‌ను 61 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుకు గవర్నర్ నో చెప్పడంతో గందరగోళం నెలకొన్నది. వయో పరిమితి బిల్లు తిరస్కరణకు గురి కావడంతో సర్కార్‌కు గట్టి షాక్తగిలినట్లైంది. అంతేగాక ఇన్ ఛార్జ్విధానంలో డీఎంఈ నియమించడంపై(జీవో 603–2017) కూడా కోర్టు స్టే ఇచ్చినట్లు సమాచారం. ఈ రెండు నిర్ణయాలతో ప్రస్తుతం డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి డైలమాలో ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయా? అని రమేష్‌రెడ్డి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన కార్యచరణ ఉంటుందని డీఎంఈ డాక్టర్రమేష్రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఏజ్లిమిట్తో సమస్య..
ప్రస్తుతం మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో రెండు వయోపరిమితులు ఉన్నాయి. ప్రొఫెసర్లకు 65 ఏళ్లు, గవర్నర్ తిరస్కరించిన బిల్లు ప్రకారం హెచ్వోడీలకు 61 ఏళ్లుగా ఉన్నది. ఈ వ్యత్యాసంతోనే పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్ల సీనియారిటీ ఆధారంగా డీఎంఈ, అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లుగా పోస్టింగ్ ఇస్తారు. కానీ ప్రొఫెసర్ల వయో పరిమితి 65 ఏళ్లు కొనసాగుతూ, అడిషనల్ డీఎంఈలు, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ల వయో పరిమితి 61 ఏళ్లకు పరిమితం చేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఒకసారి హెచ్‌వోడీ పోస్టులకు వస్తే 61 ఏళ్లకే రిటైర్డ్కావాల్సి ఉంటుంది. అదే ప్రొఫెసర్‌గా ఉండే 65 ఏళ్ల వరకు పనిచేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్నుంచి పదోన్నతులు పొంది హెచ్‌వోడీ పోస్టులకు వెళితే ముందుగానే సర్వీస్‌ను వదుకోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో హెచ్‌వోడీ పోస్టుల్లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రారని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.
అంతేగాక ఒకసారి హెచ్‌వోడీ పోస్టు తీసుకుంటే 61 ఏళ్ల వయో పరిమితి మాత్రమే వర్తిస్తుంది. అక్కడ వారి పదవి పోతే తిరిగి ప్రొఫెసర్‌గా 65 ఏళ్లు ఉండే అవకాశాన్ని కూడా కోల్పోతారు. దీంతో పాటు జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్‌గా వెళ్లడం కంటే హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు పనిచేసుకోవడమే మంచిదన్న అభిప్రాయంతో కూడా చాలా మంది ఉంటారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే రాబోయే రోజల్లో వైద్య, వైద్యలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉన్నదని వైద్యాధికారులు నొక్కి చెబుతున్నారు.
కొత్త మెడికల్ కాలేజీలకు సవాళ్లు..
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో మెడికల్‌కాలేజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. దీని ప్రకారం ప్రతి మెడికల్‌కాలేజీకి ప్రిన్సిపల్, ఆయా అనుబంధ ఆసుపత్రికి సూపరింటెండెంట్‌ను నియమించాల్సి ఉంటుంది. అంటే సీనియారిటీతో కూడిన ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పిస్తూ హెచ్‌వోడీ పోస్టులు అప్పగిస్తారు. అయితే ఇప్పుడు విభాగాధిపతుల పదవీ విరమణ వయసు బిల్లు తిరస్కరణకు గురికావడంతో పదోన్నతులు తీసుకునేందుకు ఆధ్యాపకులు ముందుకు వచ్చే ఛాన్స్తక్కువే. దీంతో కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నది. దీంతో కాలేజీలను సమర్థవంతంగా నడపడానికి ప్రభుత్వానికి పెద్ద చిక్కులు వచ్చే ప్రమాదం ఉన్నది.
ఆరుగురు అనర్హులు..
తాజాగా గవర్నర్నిర్ణయంతో డీఎంఈ కార్యాలయంలో పనిచేసే ఆరుగురు అధికారులు అనర్హులు అవుతారు. వీరిలో ప్రస్తుత ఇంచార్జీ డీఎంఈ డాక్టర్రమేష్రెడ్డి కూడా ఉన్నారు. వీరందరికీ 61 ఏళ్లు పూర్తయినట్లు సమాచారం. దీంతో పాటు వచ్చే ఏడాదిలోగా మరో ఏడెనిమిది మంది అనర్హులవుతారని ప్రభుత్వం అంచనా. ప్రభుత్వం రెండో సారి గవర్నర్‌కు బిల్లు పంపకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా, ఇదే రూల్‌ను అమలు చేస్తే.. అడిషనల్డీఎంఈ, కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా ఎంత మంది ముందుకు వస్తారనేది? సర్కార్ డైలమాలో ఉన్నది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది కొత్తగా రాబోతున్న మెడికల్‌కాలేజీలను కలుపుకొని రాష్ట్రంలో 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు కలిపి 52 మంది హెచ్‌వోడీలు ఉండాలి. వీళ్లతో పాటు డీఎంఈ కార్యాలయంలో ముగ్గురు అడిషనల్ డీఎంఈలు, ఒక డీఎంఈ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.