- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్లుండి తెలంగాణ మంత్రి మండలి సమావేశం
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 11న జరగనున్నది. పలు కీలకమైన అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నది. సచివాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం జరిగేలా ప్రాథమికంగా షెడ్యూలు రూపొందింది. నిర్దిష్టమైన ఎజెండా రూపొందనున్నది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను లాంఛనంగా భద్రాచలంలో ఈ నెల 11న ప్రారంభించనున్న నేపథ్యంలో హడ్కో నుంచి రూ. 3,000 మేర రుణాలు సమకూర్చుకోడానికి హౌజింగ్ బోర్డుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మిలోని నెలకు రూ. 2,500 చొప్పున మహిళలకు ఆర్థిక సాయం అందించడంపైనే కేబినెట్ చర్చించి ఆమోదం పొందనున్నది.
వీటికి తోడు విధానపరమైన మరికొన్ని అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రానుండడంతో ఈ లోపే ఆరు గ్యారంటీల్లో పెండింగ్‌లో ఉన్నవాటికి మంత్రివర్గం ఆమోదం పొందడంతో పాటు ఆన్-గోయింగ్ స్కీములుగా ఉంచేందుకు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.