- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల సొమ్ము దోరల పాలు.. ‘దిశ పత్రిక’ కథనంపై టీ కాంగ్రెస్ స్పందన
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రైతుబంధు పథకం ద్వారా వేల కోట్లు వృథా అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దిశ పత్రిక కథనం పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో.. ప్రజల సొమ్ము దొరల పాలు అయింది. గంజి.. ఉన్నోడి చొక్కాకు, లేనోడి కడుపుకు అవసరం. కేసీఆర్ కూడా అచ్చం అట్లనే చూసిండు రైతులను. ఉన్నోడికి.. ప్లాట్లకు, పుట్టకు, గుట్టకు, రోడ్లకు, చెరువులకు కోట్ల సొమ్మును రైతుబంధు పేరు మీద ధారపోసి, లేనోడికి మిత్తులకు సాలని పైసలు ఇచ్చిండు. రుణమాఫీ ఎగ్గొట్టిండు. కేసీఆర్ హయాంలో 20 ఎకరాల పైన ఉన్నోళ్ళు మల్లో ఎకరం కొంటే, 2 ఎకరాలు కూడా లేనోళ్ళు అప్పుల బాధ తట్టుకోలేక ఉన్న కాస్త భూమిని అమ్ముకున్నారు. ఇంకొంత మంది జీవి ఇడిశిల్లు’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే దిశ పేపర్ క్లిప్‌లను పోస్ట్ చేసింది.