- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహారాష్ట్రకు మకాం మారుస్తున్న తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర ఎలక్షన్స్ కాంగ్రెస్‌కు కీలకంగా మారాయి. ఈ స్టేట్ ఎన్నికల టాస్క్‌ను తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకత్వాలకు ఇస్తూ ఏఐసీసీ తాజాగా ఆదేశాలిచ్చింది. కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని నొక్కి చెప్పింది. ఈ నెల 20న మహారాష్ట్ర ఎన్నికలకు పోలింగ్ జరగనున్నది. దీంతో ఈ పది రోజుల గడువులోపు పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెంచాలని ఏఐసీసీ వివరించింది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు మహారాష్ట్రలో మకాం వేశారు. తెలంగాణ నుంచి ఏఐసీసీ అబ్జర్వర్లుగా మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు ఫుల్ టైమ్ అక్కడే ఉండి ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా వర్క్ చేస్తున్నారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి కూడా క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.
రేవంత్‌తో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మహారాష్ట్రకు వెళ్లిన ఏఐసీసీ అబ్జర్వర్లు, పార్లమెంటు ఇన్‌చార్జీలు, స్పోక్స్‌పర్సన్స్, ఏఐసీసీ కీలక నాయకులంతా ముంబైలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ హిమాచల్‌ప్రదేశ్‌లో ఫస్ట్ పవర్ పొందగా, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణల్లో విజయం సాధించింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడి ఫార్ములాను తెలంగాణను ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఈ రెండు స్టేట్లలో అమలు చేస్తున్న గ్యారంటీలు, పథకాలను ప్రచారాస్త్రాలుగా వినియోగిస్తున్నారు. ఏ మేరకు ఇవి ఫలిస్తాయనేది? త్వరలోనే తేలనుంది.
భవిష్యత్ కోసం..?
దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరాన్ని కలిగిన మహారాష్ట్రను దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ సర్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఏకంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను రంగంలోకి దించింది. రెండు ప్రభుత్వాల శక్తితో కొత్తగా మరో రాష్ట్రంలో జెండా ఎగురవేయాలని శతవిధాలుగా శ్రమిస్తున్నది. మహారాష్ట్రలో పవర్ సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను మరింత స్ట్రాంగ్ చేయవచ్చనేది ఏఐసీసీ విశ్వాసం. తద్వారా రాహుల్‌గాంధీని పీఎం చేయడం సులభతరంగా మారుతుందని అగ్రనాయకత్వం బలంగా నమ్ముతున్నది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోసం ఆర్థిక వనరులను సమకూర్చుకునే పరిస్థితి మిగతా రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నదని ఏఐసీసీ భావిస్తున్నది. దీంతో మహారాష్ట్రలో కచ్చితంగా కాంగ్రెస్ గెలవాలని లక్ష్యం పెట్టుకున్నది. మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకొని కొన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ ఉమ్మడి క్యాండిడేట్లకు కేటాయించింది. కేంద్రంలో పవర్ ఉన్న బీజేపీని కొట్టాలంటే ప్రాంతీయంగా చీలిపోయిన పార్టీలతో పొత్తుపెట్టుకోవాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి.
ప్రజలకు అర్థమయ్యే రీతిలో హామీల అమలుపై వివరణ
ప్రధాని మోడీ తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్ధాలు చెప్తున్నారంటూ తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రలో క్లారిటీ ఇస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోక పోయినా, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని టీజీ కాంగ్రెస్ చెప్తున్నది. కర్ణాటకలోనూ ఇచ్చిన హామీలన్నీ మొదలయ్యాయని వివరిస్తున్నారు. భవిష్యత్‌లో మహారాష్ట్రలోనూ ఇదే రిపీటవుతుందని కర్ణాటక, తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్లు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వెల్లడిస్తున్నారు. అయితే దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని, ప్రస్తుతం పవర్‌లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పక్కన పెట్టి, నల్ల చట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో రూ.2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేశామని స్వయంగా సీఎం రేవంత్ ముంబైలో వెల్లడించారు. ఆ వివరాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ కూడా చేశారు. మిగిలిన స్కీమ్స్‌ను కూడా వివరించారు. ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకాన్ని కల్పించేలా చొరవ తీసుకున్నారు.
‘మహా’ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు ఈ నేతలు ‘కీలకం’..?
ఏఐసీసీ అబ్జర్వర్ హోదాలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి 15 నియోజకవర్గాల్లో వర్క్ చేస్తున్నారు. లీడర్లను సమన్వయం చేయడం, పార్టీలో ఇంటర్నల్ ఫైట్ లకు చెక్ పెట్టడం, వర్గ విభేదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటివన్నీ స్వయంగా ఆయనే పరిశీలిస్తున్నారు. సోమవారం నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్లనున్నట్టు సమాచారం. మరో ఏఐసీసీ అబ్జర్వర్ మంత్రి సీతక్క దాదాపు 40 నియోజకవర్గాలను కో ఆర్డినేట్ చేస్తున్నారు. ఇందులో 12 నియోజకవర్గాలు పూర్తిగా ఎస్టీ రిజర్వుడ్ సెగ్మెంట్లు కావడం గమనార్హం. వీటిలో వంద శాతం విజయం సాధించేలా సీతక్క ఫోకస్ పెట్టారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల్లోని కొందరు సీతక్క ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సెగ్మెంట్లకు వెళ్లనున్నట్టు తెలిసింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ జగదీశ్‌రావు, రాచమల్ల సిద్దేశ్వర్‌రావు, మహిళా అధ్యక్షురాలు సునీతరావుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన కొందరు కీలక నేతలంతా మహారాష్ట్రలోని వివిధ నియోజకవర్గాల్లో వర్క్ చేస్తూనే ఉన్నారు.