‘మా నాయకుడు రేవంత్ రెడ్డి సిద్ధం.. మీరు రెడీనా ఈటల రాజేందర్ గారూ’ (వీడియో)

by GSrikanth |
‘మా నాయకుడు రేవంత్ రెడ్డి సిద్ధం.. మీరు రెడీనా ఈటల రాజేందర్ గారూ’ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌-కాంగ్రెస్ నాణేనికి బొమ్మ, బొరుసులాంటివని.. ఎన్నికలకు ముందో తర్వాతో ఈ రెండు పార్టీలు కలుస్తాయని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్ల కేసీఆర్ ఇచ్చింది నిజం కాదా? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇప్పటికే ఈటల వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరూపించాలని సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం దిగజారి రాజకీయాలు చేయడం మానుకోవాలని ఈటలకు హితవు పలికారు. అయితే, ఈటల ఆరోపణలపై తాజాగా.. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ స్పందించారు. ‘‘ఈటల రాజేందర్ గారికి సవాల్ విసురుతున్నాం.. కేవలం బీజేపీ మెప్పుకొరకు మీరు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయడానికి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు సిద్ధం.. రుజువు చేయడానికి మీరు సిద్దమా?’’ అని ట్విట్టర్ వేదికగా మరోసారి సవాల్ విసిరారు.

Advertisement

Next Story