- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రయత్నాన్ని ఆపండి.. డీజీపీకీ టీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకోవాలని టీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో భద్రత సమస్యలపై శనివారం టీకాంగ్రెస్ నేతలు కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు డీజీపీ రవి గుప్తకు లేఖను అందజేశారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో అదనపు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కపిలవాయి దిలీప్ మాట్లాడుతూ .. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగాలంటే రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ సరిపోదని అదనపు బలగాలను తెప్పించాలన్నారు. బీజేపీ యువతను రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ, భద్రత విషయంలో వచ్చే సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను వచ్చే నెల 3,4 తేదీలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని చెప్పారు.