- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్షన్ మూడ్‌లోకి T- కాంగ్రెస్.. అధికారమే లక్ష్యంగా రెడీ అవుతోన్న ‘జంబో’ టీమ్..!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ టీమ్ రెడీ అవుతున్నది. పీసీసీ కార్యవర్గంపై కసరత్తు ప్రారంభమైంది. ఈసారి ఎలాంటి సమస్యలు రాకుండా సమన్వయంతో కమిటీలు వేయాలని ఏఐసీసీ ఆదేశాలిచ్చింది. కులాలకు ప్రాధాన్యత ఇస్తూనే సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. విభేదాలు తలెత్తకుండా కొత్త టీమ్‌ను తయారు చేయనున్నారు. ఈ మేరకు గడిచిన రెండు రోజులుగా ఢిల్లీలో తెలంగాణ పీసీసీ కార్యవర్గంపై చర్చ జరుగుతున్నట్లు ఓ నేత తెలిపారు.
ఇప్పటికే టీ కాంగ్రెస్ పీసీసీ, ఏఐసీసీ నేతల నుంచి అభిప్రాయాలను కూడా సేకరించినట్లు తెలిసింది. కొందరు ముఖ్య లీడర్లు పీసీసీ కమిటీలలో తమ అనుచరులకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు. అయితే నేతల్లో అసంతృప్తి రాకుండా థాక్రే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో పార్టీ కోసం శ్రమించిన లీడర్లు, కార్యకర్తల పేర్లను పంపించాల్సిందిగా ఇప్పటికే అన్ని జిల్లాల అధ్యక్షులకు టీపీసీసీ ఆదేశాలిచ్చింది.
గతంలో విమర్శల పర్వం..
గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాల్లో తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వలేదని పలువురు సీనియర్లు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పెద్దలు కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని సదరు కమిటీలు రాజీనామాలు చేసేవరకు ఒత్తిడి తెచ్చింది. ఇందులో ఎక్కువమంది రేవంత్ రెడ్డి వర్గానికి చెందినోళ్లే ఉండటం గమనార్హం.
దీంతో ఈ సారి అలాంటి సమస్య పునరావృతం కాకుండా పరిష్కరించాలని రాహుల్, ప్రియాంక ఆదేశాలతో థాక్రేనే స్వయంగా కమిటీల ఏర్పాటను సమన్వయం చేస్తున్నారు. 33 జిల్లాల నేతలకు అవకాశం కల్పించేలా జంబో టీమ్‌ను సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఎన్నికల టాస్క్..
కొత్తగా ఏర్పాటు చేయబోయే పీసీసీ కమిటీలకే ఎన్నికల టాస్క్ఇవ్వాలని కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం తీసుకున్నది. బూత్ లెవల్‌నుంచి జిల్లాస్థాయి వరకు వివిధ కమిటీలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతలను కూడా ఈ టీమ్‌లకు అప్పగించనున్నారు.
దీంతోపాటు గ్రౌండ్ లెవల్‌లో పార్టీ పరిస్థితులను పరిశీలిస్తూ, ఎన్నికలకు సిద్ధమయ్యేలా కార్యక్రమాలను రూపొందించడం, ఇంటింటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను జనాల్లోకి తీసుకువెళ్లడం, ప్రభుత్వ వైఫల్యాలు, తప్పుడు నిర్ణయాలు వంటివన్నింటినీ ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నారు. దీంతోపాటు సోషల్ మీడియా, ప్రచార కమిటీల మానిటరింగ్ బాధ్యతలను కూడా ఈ కమిటీలకే ఉంటుందని ఓ నేత తెలిపారు.