- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ భారీ ప్లాన్.. అన్ని నియోజకవర్గాలను కదిలించేలా వ్యూహం!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి అసెంబ్లీలో ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది. దీంతో పాటు పార్లమెంట్ పరిధిలో పాలిటెక్నిక్కాలేజీ, జిల్లాకో స్కిల్ డెలవప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యధిక శాతం రూరల్డెవలప్ మెంట్‌కు ప్రయారిటీ ఇవ్వనున్నారు. రూరల్ఏరియాల్లోని యువతకు ఉపాధి కల్పించడమే ఎజెండగా కాంగ్రెస్ముందడుగులు వేస్తోన్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉన్న ఖాళీలను నింపి, ఆ తర్వాత జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నారు. దీంతో పాటు మన రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉద్పోగ కల్పనకు కృషి చేయనున్నారు. ఈ మేరకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. లాంగ్వేజ్, టెక్నికల్ స్కిల్స్‌పై ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇచ్చి, విదేశాల కంపెనీలతో ప్రభుత్వం సమన్వయమై ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.
9 అంశాలపై డిక్లరేషన్.. సెప్టెంబరు 17న మ్యానిఫెస్టో
వరంగల్ వేదికపై రాహుల్ఆధ్వర్యంలో రైతు, హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో ప్రియాంక సమక్షంలో యూత్ డిక్లరేషన్ తరహాలో అతి త్వరలో సోనియా గాంధీ సమక్షంలో మహిళా డిక్లరేషన్ప్రకటించాలని కాంగ్రెస్పార్టీ ఆలోచిస్తున్నది. దీంతో పాటు ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల తదితరవి కలిపి 9 అంశాలపై కాంగ్రెస్పార్టీ డిక్లరేషన్ప్రకటించనున్నది. ఇవన్నీ క్రోడీకరిస్తూ ప్రత్యేక మ్యానిఫెస్టోనూ తయారు చేయనున్నారు. దీన్ని సెప్టెంబరు17న విడుదల చేయనున్నారు. అంతేగాక సెప్టెంబర్ 17ను స్వతంత్ర దినోత్సవంగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహించనున్నది. ఇక ఇప్పటికే ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌ను రెండు రోజుల్లో ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. యూనివర్సిటీలు, కాలేజీలు, ఇతర కంపెనీలు, గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు టీపీసీసీ కమిటీలను కూడా నియమించనున్నది.
Also Read..