Congress : గురుకులాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు ఉందా? హరీష్‌రావుకు కాంగ్రెస్ కౌంటర్

by Ramesh N |
Congress : గురుకులాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు ఉందా? హరీష్‌రావుకు కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లా పాలమాకుల కేజీబీవీ పాఠశాల హాస్టల్ లో పురుగుల అన్నం పెడుతున్నారని, అడిగితే టీచర్లు వేధిస్తున్నారని విద్యార్థినిలు నిన్న రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే వారిని మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రా రెడ్డి కేజీబీవీ విద్యాల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యల‌ను అడిగి తెలుసుకున్నారు. గురుకులాలు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నిర్ల‌క్ష్యానికి గుర‌వుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర పోస్ట్ చేసింది.

పదేళ్లలో విద్యావ్యస్థను నిర్వీర్యం చేసి గురుకులాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు ఉందా? అని ప్రశ్నించింది. ఎప్పుడైనా పేద విద్యార్థుల గోస విన్నారా? వసతులు లేవంటే పట్టించుకున్నారా? పురుగుల అన్నం పెడితే పరిగెత్తుకుంటూ వెళ్లి చూసినరా? ఇరుకు గదులు, అందని దుప్పట్లు, అద్దె గదుల అవస్థలు, ముక్కిన బియ్యం, భోజనంలో బొద్దింకలు, బాత్రూమ్ లేక ఆరుబయటికి వెళ్లి పిల్లల అవస్థలు అంటూ ప్రశ్నించింది. హరీష్ రావు గారు గత పదేళ్లలో మీ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది.. అని పేర్కొంది. నాడు కేసీఆర్ పెంచి పోషించిన పాపం, నేడు తెలంగాణకు శాపంగా మారిందని విమర్శించింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరండని పేర్కొంది.

Advertisement

Next Story