కర్ణాటకకు బయలుదేరనున్న తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నేతలు..రెండు రోజులు అక్కడే

by Mahesh |
కర్ణాటకకు బయలుదేరనున్న తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నేతలు..రెండు రోజులు అక్కడే
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు(Telangana Congress leaders) కర్ణాటక( Karnataka)కు బయలుదేరనున్నారు. రేపటి నుండి బెల్గాం(Belgaum)లో రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు‌(CWC meetings) జరగనున్నాయి. కాగా ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనేందుకు గాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నేడు హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెల్గాంకు వెళ్తున్నారు. కాగా రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనుండటంతో కీలక నేతలు ముగ్గురు కర్ణాటకలోనే ఉండనున్నారు. కాగా ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో ఏఐసీసీ కీలక నేతలు పాల్గొననుండగా.. దేశంలోని కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలపై ప్రజల స్పందన తో పాటు ఏడాది పాలనపై రిపోర్టులను అధిష్టానం ముందు ఉంచనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సమావేశాల్లోనే తెలంగాణ కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed