రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-07 06:48:16.0  )
రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
X

దిశ, వెబ్‌డెస్క్: 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ప్రవేశపెట్టారు.రూ.2.56 లక్షల కోట్లతోబడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.29.728 కోట్లగా నిర్ణయించారు. దళితబంధుకు రూ.17,700, కొత్త వైద్యకళాశాలలకు రూ. వెయ్యి కోట్లు కేటాయించారు. అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు, పల్లె ప్రగతి కార్యక్రమానికి రూ.330 కోట్లు, పట్టణ ప్రగతి ప్రాణాళికకు రూ. 1,394 కోట్లు, పోలీస్ శాఖకు రూ.9,315 కోట్లు కేటాయించారు. అసరా పెన్షన్స్‌కు 11728 కోట్లు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ కి 2750 కోట్లు కేటాయించారు.

సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇవ్వనున్నారు.ఎస్టీల సంక్షేమానికి రూ.12,565 కోట్లు, వ్యవసాయ శాఖకు 24254 కోట్లు, ఇరిగేషన్ కు 22675 కోట్లు , హరిత హారానికి 932 కోట్లు , డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం 12 వేల కోట్లు, గిరిజన సంక్షేమం కోసం 12, 565 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 5698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం 117 కోట్లు, ఆర్ అండ్ బి కోసం 1,542 కోట్లు, పోలీస్ శాఖకు 9315 కోట్లు కేటాయించింది. ఫారెస్ట్ యూనివర్సిటీకి 100 కోట్లు, ఆయిల్ ఫామ్ సాగుకు రూ. వెయ్యి కోట్లు కేటాయించింది.

Advertisement

Next Story