- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana Budget: బడ్జెట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్ అని, ఆర్భాటపు అంకెలు కాకుండా వాస్తవపు లెక్కల బడ్జెట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రానికి సంబందించి 2024-25 వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు, రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమాన్ని సమన్వయం చేసుకుని రూపొందించారని సీఎం ప్రశంసించారు. అలాగే ఆరు గ్యారెంటీలకు హామీ పత్రం ఈ బడ్జెట్ అని స్పష్టం చేశారు. అంతేగాక ఆర్భాటపు అంకెలు కాదు, వాస్తవపు లెక్కల బడ్జెట్ ఇది అని తెలిపారు. ఇక కేంద్రం వివక్ష.. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల మధ్య తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్ ను రూపొందించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమాత్యులు మల్లు భట్టీ విక్రమార్క గారికి, వారి బృందానికి నా అభినందనలు అంటూ రేవంత్ రెడ్డి ఎక్స్ లో రాసుకొచ్చారు.