మీ లాజిక్కే మీకు పాములా కాటేసింది..కాంగ్రెస్ పై టీ బీజేపీ సెటైరికల్ ట్వీట్

by Prasad Jukanti |
మీ లాజిక్కే మీకు పాములా కాటేసింది..కాంగ్రెస్ పై టీ బీజేపీ సెటైరికల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2024-25 వార్షిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతున్నది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందని బడ్జెట్ లో కనీసం తెలంగాణ పేరును ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రజలను అవమానించిందంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలకు టీ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడినట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు ను చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బబడ్జెట్ పై తర్కవంతమైన ప్రశ్నలు అడగలేక కాంగ్రెస్ లేవనెత్తిన అంశమే వారిని పాములా కాటేసిందని సెటైర్ వేసింది. కాంగ్రెస్ లాజిక్ ప్రకారం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరు లేకపోతే తెలంగాణకు ఏమి రావట్లే అయితే మరి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో జిల్లాల పేర్లు ప్రస్తావించలేదు. ఈ లెక్కన జిల్లాలకు ఏ నిధులు కేటాయించట్టేనా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించింది. రాష్ట్ర బడ్జెట్ లో ఎన్ని జిల్లాల పేర్లు ఉన్నాయి? జిల్లాల వారీ కేటాయింపుల వివరాలు ఉన్నాయా పేర్లు లేకుంటే నిధులు లేనట్టేనా అని నిలదీసింది. అసత్య ప్రతచారాలపై అధికారం చేపట్టిన మీకు చైతన్యవంతమైన తెలంగణ సమాజం చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించింది.

Advertisement

Next Story