'నిజాం హింసాకాండను సీఎం కేసీఆర్ మర్చిపోయారా?'

by GSrikanth |
నిజాం హింసాకాండను సీఎం కేసీఆర్ మర్చిపోయారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 17ను ఎనిమిదేండ్లుగా ఎందుకు నిర్వహించలేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్రం నిర్వహిస్తుందని తెలిసి సమైక్యతా అంటూ కొత్త పల్లవి అందుకున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని రెడ్ హిల్స్‌లోని బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లారు. అల్పాహారం తీసుకొని కుటుంబ సభ్యులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాం పాలనలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, హింసాకాండను ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచిపోయారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పేదల సంక్షేమం గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. కేవలం పెద్దల కోసమే పని చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ అధికారంలోకి రాలేదన్నారు. ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. ఈనెల 17న కేంద్రం విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదని, పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న వేడుకలకు అమిత్ షా హాజరవుతున్నట్లుగా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed