- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది విద్యార్థులపై కృూరమైన జోక్.. రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో ఎలాంటి ఫుడ్ పాయిజన్ సంఘటనలు నమోదు కాలేదంటూ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ విద్యార్థులపై బ్లఫ్ మాస్టర్ రౌడీ సర్కార్ (బీఆర్ఎస్) చేస్తున్న క్రూరమైన జోకుగా అభివర్ణించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల హాస్టల్స్‌లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నమోదయ్యాయి.
అయితే వీటికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు అధికారులు 'అలాంటి ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదు' అని బదులిచ్చారు. దీనిపై ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనానికి సంబంధించిన స్క్రీన్ షార్ట్‌ను షేర్ చేస్తూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి ట్వీట్‌పై రియాక్ట్ అయిన మరో బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణపై దారుణంగా అపహాస్యం చేస్తోందని తెలంగాణ కోసం పోరాడిన వారు ప్రస్తుత పరిస్థితులను చూసి మనం పోరాటం చేసింది ఇలాంటి రాష్ట్రం కోసమేనా అని ఆశ్చర్యపోతున్నారన్నారు. ఈ ధనిక రాష్ట్రానికి ఏమైనందని ప్రశ్నించారు.
కాగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్), తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) సంస్థలకు ఓ సంస్థ ఆర్టీఐ కింద మీమీ సంస్థల్లో నమోదైన ఫుడ్ పాయిజనింగ్ కేసుల వివరాలు తెలిపాలని కోరింది.
అయితే ఆర్టీఐ దాఖలు చేసి దాదాపు రెండు నెలలు కావస్తున్న టీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ ఇప్పటి వరకు స్పందించలేదని ఈ బండి సంజయ్ షేర్ చేసిన కథనం పేర్కొంది. టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థలు మాత్రం తమ పరిధిలో ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు కాలేదని సమాధానం ఇచ్చాయి. అయితే ఈ సంస్థలు ఇచ్చిన సమాధానానికి తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ డేటా వివరాలకు విరుద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమీషన్ మీడియాలో వచ్చిన ఫుడ్ పాయిజనింగ్ కేసులను నమోదు చేసినట్లు ఈ కథనం పేర్కొంది. వీటిలో కొన్ని కేసులు పరిష్కారం కాగా మరికొన్ని ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొంది.
కాగా సెప్టెంబర్ 2022 మరియు ఫిబ్రవరి 2023 మధ్య ఆదిలాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి మరియు మహబూబాబాద్ జిల్లాల నుండి అనేక అనుమానిత ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే హక్కు ఇనిషియేటివ్ అనే పరిశోధనా సంస్థ ఫుడ్ పాయిజనింగ్ కేసుల సంఖ్యను నమోదు చేసింది. దాని ప్రకారం, తెలంగాణలోని 23 జిల్లాల్లోని గత 11 నెలల వ్యవధిలో 43 వివిధ విద్యాసంస్థల్లో 1,549 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యాయినట్లు ఈ కథనం పేర్కొంది.