- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana BJP: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు
దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సవాల్(Challenge) ను స్వీకరించిన(Accepted) బీజేపీ నేతలు(BJP Leaders).. సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో(Musi Catchment Areas) ఒక రోజు చేయాలని నిశ్చయించుకున్నారు. ఇటీవల మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. మూసీ ప్రక్షాళన(Cleaning Of The Musi)పై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, మూసీ ప్రజల కష్టాలు తెలియాలంటే బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేసి చూపించాలని అన్నారు.
ముఖ్యమంత్రి మాటలను ఛాలెంజ్(Challenge) గా తీసుకున్న బీజేపీ.. మూసీ పరివాహక ప్రాంతాల్లో బస చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ నె 16న బీజేపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండనున్నారు. మూసీ నది వెంట 25 ప్రాంతాల్లో(25 Areas) రాత్రి బస చేసి, బీజేపీ ప్రజల కష్టాలపైనే పోరాటం చేస్తోందని నిరూపించాలని భావిస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నాయకులు ఈ నెల 16న సాయంత్రం 4 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు మూసీ నది వెంట ఉన్న ఇళ్లలో ఒక రోజు గడపనున్నారు.