‘30 సార్లు రిక్వెస్టు చేశా.. ఒక్కసారి కూడా సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు’

by GSrikanth |   ( Updated:2024-01-06 12:18:48.0  )
‘30 సార్లు రిక్వెస్టు చేశా.. ఒక్కసారి కూడా సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సీఎంను కలిసేందుకు తాను 30 సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదని టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి రావడం దారుణమన్నారు. శనివారం అసెంబ్లీ కౌన్సిల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఒకసారి ప్రగతిభవన్‌కు వెళ్లినా, తనను ఓ డీఎస్పీ స్థాయి అధికారి అడ్డుకున్నారన్నారు. పొరపాటున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనుకొని గేట్ వద్ద లోపలికి పంపించామని ఆ డీఎస్పీ చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని, ఇప్పటి వరకు తనకు రిప్లై రాలేదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలనలో ప్రజాప్రతినిధులకు కూడా సరైన గౌరవం లభించలేదన్నారు.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లభించేందుకు పునాదులు పడుతున్నాయన్నారు. ప్రజాదర్భార్‌లు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. తాను కూడా గడిచిన పది రోజుల్లోనే నాలుగు సార్లు సీఎంను కలిశానన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్థం చేశారన్నారు. ప్రభుత్వ సూళ్లను ఆధ్వన్నంగా తయారు చేశారన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నో పేద కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపే పరిస్థితి వచ్చిందన్నారు. సర్కార్ సూళ్లల్లో సకాల సౌకర్యాలు కల్పిస్తే ప్రైవేట్ వైపు పేదలు అడుగు పెట్టే సిచ్చువేషన్ ఉండదన్నారు.

Advertisement

Next Story

Most Viewed