- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీడీపీ 41 ఆవిర్భావ దినోత్సవం.. గ్రాండ్‌గా పార్టీ ప్రతినిధుల సభ
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 29న టీడీపీ 41 ఆవిర్భావ దినోత్సవానికి పురస్కరించుకొని ప్రతినిధుల సభను హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నామని, రెండు తెలుగురాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రతినిధులతో హాజరుకానున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు కలిసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పార్టీ నాయకులు విధిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగనున్నదని వెల్లడించారు. ఈ నెల 28న ఎన్టీఆర్ భవన్ లో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ మొత్తం పసుపు మయం అయ్యేలా చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
కూడళ్లలో టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌ను ప్రధాన చౌరస్తాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో నాయకులు నన్నూరి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, హైదరాబాద్ నగర నాయకులు రవీంద్రచారి, డాక్టర్ ఏ ఎస్ రావు, సాంబ శివరావు, సైదేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.