- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫూలే ఆశయాలు అమలు చేయడమే మా లక్ష్యం: TDP
దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా అభ్యుదయవాది మహాత్మజ్యోతిరావు పూలే అని టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. పూలే తన గురువు అని అంబేద్కర్ అన్నారంటే గొప్పతనమేంటో తెలుస్తుందన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం పూలే జయంతి నిర్వహించారు. పూలే చిత్రపటానికి కాసాని పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. మహిళలకు విద్య నేర్చుకునే అవకాశాలు లేని నాటి రోజుల్లో జ్యోతిరావు పూలే మొదట తన భార్యకు విద్య నేర్పించారన్నారు.
మహిళల కోసం ప్రత్యేకంగా విద్యాలయాలు నెలకొల్పారని, పూలే స్ఫూర్తితోనే నాటి నుంచి నేటి వరకు మహిళలు అనేక మంది విద్యావంతులు అయ్యారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూలే ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ బడుగు, బలహీనవర్గాలకు పదవుల్లో పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్, మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు షేక్ ఆరిఫ్, షకీలా రెడ్డి, బండారి వెంకటేష్, భాను ప్రసాద్, సాయి తులసి, మోపతయ్య, రాఘవులు, సూర్యదేవర లత, లీలాపద్మావతి, కృష్ణవేణి రెడ్డి, అనూప్ తదితరులు పాల్గొన్నారు.