- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఆరోగ్యశాఖ నిద్రపోతుందా..?
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తే రాష్ట్రం పురోగమనంలో ఉందా? లేకుంటే తిరోగమనంలో ఉందా అనేది ప్రజలే ఆలోచించాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన కోరారు. ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బంగారు తెలంగాణ చేస్తామని పదే పదే చెప్పి అనేక వాగ్ధానాలు చేసిన కేసీఆర్.. రాష్ట్రంలోనే కాక దేశ రాజకీయాలను చేయాలని చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్నే బాగుచేయలేని ఆయన దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న పీహెచ్‌సీలో కుటుంబ నియంత్ర శస్త్ర చికిత్స ఘటన దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కు.ని ఆపరేషన్‌తో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. వసతులు భేష్ అని చెప్పకుంటున్న వైద్యశాఖ.. నిలోఫర్ ఆసుపత్రిలో ఒకే బెడ్‌పై ముగ్గురు పేషంట్లు చికిత్స పొందుతున్నారనే వార్తలు వస్తున్నాయని.. అయితే ఆరోగ్యశాఖ నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. వైద్యరంగంలో లోపాలని సరిద్దిద్దాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.