తెలంగాణపై చంద్రబాబు ఫోకస్.. టీడీపీ అధ్యక్ష బరిలో ఐదుగురు కీలక నేతలు

by srinivas |   ( Updated:2024-08-10 10:52:53.0  )
తెలంగాణపై చంద్రబాబు ఫోకస్.. టీడీపీ అధ్యక్ష బరిలో ఐదుగురు కీలక నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించున్నారు. తొలుత తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకోని ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. మరికాసేపట్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఆయన చేరుకోనున్నారు. పార్టీ బలోపేతంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు చేరుకోనున్నారు. చంద్రబాబుతో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే టీటీడీపీ అధ్యక్షుడి బరిలో సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నరసింహులు, నందమూరి సుహాసిని, సామా భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా లక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story