- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడుపై చంద్రబాబు ఫోకస్.. పార్టీ శ్రేణులకు కీలక సూచన
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో టీడీపీ బలపడితేనే బీసీలకు భవిష్యత్ అని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో బాబు నివాసంలో ఆదివారం తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీపై చర్చించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. పార్టీని బలోపేతం చేయడానికి అటు సంస్థాగతంగా, ఇటు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీకి ఇంకా బలమైన కేడర్ ఉందన్నారు. పార్టీ శ్రేణులంతా నిరంతరం ప్రజల్లో ఉండాలని, సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. టీడీపీ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మునుగోడులో పొత్తులతో మూడుసార్లు బీసీలకే ఇచ్చామని తక్కువ ఓట్లతో ఓడిపోయామన్నారు.
టీడీపీ బలహీనపడటంతో బడుగు బలహీన వర్గాలు బలహీనపడుతున్నాయని, అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో పోటీపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. మునుగోడు నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మూడుపార్టీలు రెడ్లకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, నియోజకవర్గంలో బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని తెలిపారు. గత కొంతకాలంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని వివరించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, రావుల చంద్రశేఖర రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రాంమోహన్ రావు, నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్, తెలుగుదేశం తెలుగుదేశం ప్రకాశ్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అధ్యక్షుడు కృష్ణమాచారి, మునుగోడు నియోజకవర్గం ముఖ్య నాయకులు బడుగు లక్ష్మయ్య, అక్కెనఅప్పారావు, హన్నుభాయ్, వయిజ్ తదితరులు పాల్గొన్నారు.