స్పీడ్ పెంచిన కాసాని.. 3 అసెంబ్లీ స్థానాలకు కో-ఆర్డినేటర్ల నియామకం

by Satheesh |
స్పీడ్ పెంచిన కాసాని.. 3 అసెంబ్లీ స్థానాలకు కో-ఆర్డినేటర్ల నియామకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మ‌హ‌బూబాబాద్ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని భ‌ద్రాచ‌లం, ఇల్లెందు, న‌ర్సంపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు టీడీపీ కో-ఆర్డినేట‌ర్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియ‌మిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భ‌ద్రాచ‌లం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్‌గా ఈసం శ‌శింధ‌ర్‌, ఇల్లెందు కో-ఆర్డినేట‌ర్‌గా ముద్రగ‌డ వంశీ, న‌ర్సంపేట కో-ఆర్డినేట‌ర్‌గా అడ‌పా న‌ర్సింగ‌రావు నియామకం అయ్యారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో నియామక పత్రాలను కాసాని అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ టీడీపీ పార్లమెంటు అబ్జర్వర్ రామచందర్ రావు, రాష్ట్ర టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు మండూరి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story