- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘టాస్క్ తెలంగాణ’ టీ- కాంగ్రెస్ నయా స్కెచ్ ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్...తెలంగాణలోనూ తన జెండా ఎగురువేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నది. ఈ మేరకు ‘టాస్క్తెలంగాణ’ పేరిట కాంగ్రెస్ యాక్టివిటీస్ మొదలు పెట్టనున్నది. దీనిలో భాగంగా ఢిల్లీలో ప్రత్యేక మీటింగ్ ను నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయించింది. అమెరికా పర్యటన నుంచి రాహుల్, రేవంత్‌లు తిరిగి రాగానే, ఢిల్లీలో ప్రత్యేక మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో తెలంగాణ టీ కాంగ్రెస్ లీడర్లు, టీమ్‌లకు సునీన్ కనుగోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అమలు చేయాల్సిన వ్యూహాలు, చేయాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిపై కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నేతలకు అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటు ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీపై కూడా చర్చ జరగనున్నది. ఇక ఇప్పటికే సునీల్ కనుగోలు చేసిన సర్వే ద్వారా వివిధ అసెంబ్లీ సెగ్మెంట్‌లలో టిక్కెట్లు ఆశిస్తున్న లీడర్ల సర్వేను కూడా పరిశీలించనున్నారు. ఆయా లీడర్లపై ఏఐసీసీ ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నది. దీంతో పాటు ఏఐసీసీ, కాంగ్రెస్ జాతీయ నేతలు తెలంగాణ పర్యటనకు సంబంధించిన అంశంపై కూడా ఢిల్లీ మీటింగ్‌లో క్లారిటీ రానున్నది.
ఏ లీడర్ ఏ ప్రాంతంలో పర్యటించాలనే దానిపై షెడ్యూల్ ఫిక్స్ కానున్నది. ఇక ఇప్పటికే అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలతో రాహుల్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు వరుస మీటింగ్‌లు పెడుతూ కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వాలని కోరారు. వాషింగ్టన్, న్యూయార్క్‌లలో సభలు పెట్టి కాంగ్రెస్ విధి, విధానాలను ప్రకటించారు. దీంతో పాటు ముఖ్యమైన ఎన్ఆర్ఐలతో అంతర్గత మీటింగ్‌లు నిర్వహిస్తూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వస్తే తెలంగాణకు జరిగే మేలుపై వివరిస్తున్నారు.