- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCRకు వేసిన ఛాలెంజ్ నిలుపుకుంటున్న CM రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ చేరికల ఆపరేషన్ సక్సెస్!
దిశ, తెలంగాణ బ్యూరో: బడ్జెట్ సెషన్ నాటికి అ సెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునేం దుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ఆ పార్టీని మానసికంగా దెబ్బతీస్తున్నది. చేరికల విషయం సొంత పార్టీ నేతలకు కూడా తెలియ కుండా, ఎవరెవరు చేరుతున్నారనేది లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇకపై కంటిన్యూగా జాయినింగ్స్ ఉంటాయని టీపీసీసీకి చెందిన ఓ నేత తెలిపారు. తమ టార్గెట్ 25 మంది ఎమ్మెల్యేలని, ఇప్పటికే ఆరుగురు చేరగా, త్వరలో మిగతా వారంతా చేరుతారని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలతో కలుపుకుంటే ప్రస్తుతం అధికార పార్టీ సభ్యుల సంఖ్య 71కి చేరుకున్నది.
లీకులు కాకుండా కండువాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో చేరబోతున్నారని గత కొన్ని రోజుల నుంచి పొలిటికల్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఫలానా ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారంటూ మీడియా సర్కిళ్లలోనూ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ పార్టీ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలతో ఎవరు, ఎప్పుడు పార్టీ చేంజ్ అవుతున్నారనే విష యం ఇటు పబ్లిక్‌తో పాటు పార్టీ నేతలకూ తెలియ డం లేదు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ప్రతిపక్ష పార్టీలకు చిక్కకుండా అమలవుతున్నాయని కాం గ్రెస్ పార్టీ నేతలు సంతోష పడుతున్నారు. తాను పార్టీ మారడం లేదని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దానం నాగేందర్.. ఆ మరుసటి రోజే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన తాను కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయనని చెప్తూనే భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు.
ఇక వరంగల్ ఎంపీ స్థానం నుంచి అభ్యర్థిగా తన కూతురి పేరును బీఆర్ఎస్ ప్రకటించినా, పవర్ పార్టీలోకి వెళ్తేనే బెటర్ అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సడన్‌గానే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక కూడా ఇదే తరహాలో జరగ్గా, షాద్‌నగర్ ఎమ్మెల్యే కాలే యాదయ్య జాయినింగ్‌తో బీఆర్ఎస్ పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. ఒక రోజు ముందు వరకు హైదరాబాద్‌లోనే ఉన్న యాదయ్య, సడన్‌గా ఢిల్లీలో ప్రత్యక్షమై, సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీలో చేరడం విశేషం. పైగా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరూ ఇప్పటి వరకు ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. రిజైన్ చేస్తే, మాజీ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో సంప్రదింపులు జరిపే చాన్స్ ఉన్నదని ఓ ఎమ్మెల్యే చెప్పారు.
హిస్టరీ రిపీట్..
బీఆర్ఎస్ అధినేత ఊహకు అందకుండా కాంగ్రెస్ తన స్ట్రాటజీని అమలు చేస్తున్నది. గతంలో కేసీఆర్ పాటించిన విధానాలనే, కాంగ్రెస్ రిపీట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా దక్కకుండా వ్యహరించిన కేసీఆర్‌కు, ఇప్పుడు అదే విధానాన్ని చూపించాలని సీఎం రేవంత్ వ్యూహాలను రచించి అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే గతంలో ‘కేసీఆర్ ప్రతి రోజూ తన దొడ్లో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో లెక్కపెట్టుకోవాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు అమలవుతున్న స్ట్రాటజీ అదే తరహాలో ట్విస్టులు ఇస్తున్నదని పొలిటికల్ సర్కిళ్లలో చర్చలు జరుగుతున్నాయి.