టార్గెట్ సౌత్ స్టేట్స్.. బీజేపీ స్కెచ్ ఇదేనా?

by Rajesh |
టార్గెట్ సౌత్ స్టేట్స్.. బీజేపీ స్కెచ్ ఇదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో అధికారం నిలుపుకుంది. మరో రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వంలో భాగస్వామ్యం కానుంది. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీలో 25, కర్ణాటకలో 28, తమిళనాడులో 39, కేరళలో 20, తెలంగాణలో 17 కలిపి మొత్తం 129 ఎంపీ స్థానాలున్నాయి. కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో 129 స్థానాలకు 29 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. ఇందులో కర్ణాటక నుంచి 25 స్థానాలు ఉండగా తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలుగా గెలుపొందారు.

కాగా కర్ణాటకలో బీజేపీ ప్రస్తుతం అధికారంలో కొనసాగుతోంది. అయితే 2023 ఎన్నికల్లో సౌత్ స్టేట్ టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణపై సైతం బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేసీఆర్‌ను నిలువరించి జాతీయ పార్టీకి, కూటమి రాజకీయాలకు చెక్ పెట్టాలని చూస్తోంది. అటూ కేంద్రంలో అధికారంలోకి రావడంతో పాటు ఇటూ సౌత్ లో పాగా వేస్తే తమకు తిరుగుండదని బీజేపీ భావిస్తోంది.

ప్రతిపక్ష నాయకులంతా ఏకం కావొద్దంటే ఆయా రాష్ట్రాల్లో తామే ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ యోచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రాల వారీగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కమ్యూనిస్టు ప్రాభల్యం ఉన్న కేరళలో సైతం ఈ సారి గెలిచి తీరతామని ప్రధాని మోడీ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. మోడీ - అమిత్ షా ద్వయం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సౌత్‌లో పార్టీ ఎక్స్ పాన్షన్ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. దేశ వ్యాప్తంగా పార్టీ జెండా ఎగరవేసేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

ఆ రాష్ట్రాల్లో భాగస్వామ్యంతోనైనా..

కర్ణాటకలో బీజేపీ ఇప్పటికే అధికారంలో కొనసాగుతోంది. ఎన్నికల వేళ ప్రధాని ఇటీవలే పలు కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించారు. ఇక తమిళనాడు, కేరళలో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. 2021లో డీఎంకే నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొన్న బీజేపీ 4 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది తమ ప్రాభల్యాన్ని చాటుకుంది.

తమళనాడు బీజేపీ చీఫ్ మాత్రం సంస్థాగతంగా బలపడుతున్నామని మోడీ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతమని ధీమాగా ఉన్నారు. చైతన్య వంతులైన ఓటర్లున్న కేరళలో బీజేపీ కష్టపడాల్సి ఉంది. పినరయి విజయన్‌పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణల ఎఫెక్ట్ ఎమైనా ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది. బీజేపీ మాత్రం సౌత్ స్టేట్స్ టార్గెట్‌గా తమ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ ప్రతిపక్షాల్లో గుబులు పుట్టిస్తోంది.

రెండు రాష్ట్రాల సీఎంలను ఇరుకున పెట్టే స్కెచ్..

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌లను ఇరుకున పెట్టేలా బీజేపీ ప్లాన్ చేసింది. ఏక కాలంలో ఈ రెండు రాష్ట్రాల్లో లిక్కర్ స్కాం కేసు, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తెర మీదకు తెచ్చింది. ఎప్పుడూ లేనంతగా ఈ రెండు కేసుల్లో దర్యాప్తును కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్పీడ్ అప్ చేసింది. వైఎస్ జగన్‌కు చెక్ పెట్టడంతో పాటు టీడీపీని మళ్లీ చేరదీసి ఏపీలో మళ్లీ పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది.

చంద్రబాబు సైతం ఇటీవల బీజేపీతో సాఫ్ట్ గానే ఉంటున్నారు. పొత్తుల అంశంపై ఏపీలో క్లారిటీ రావాల్సి ఉన్న బీజేపీ మాత్రం టీడీపీ, జనసేన వైపే మొగ్గు చూపుతుంది. అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తితో జత కట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధంగా లేనట్లు సమాచారం. లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ ప్రతిష్ట మసకబారే ఛాన్స్ ఉంది. రెండు దఫాలుగా పాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ అంశం కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఎఫెక్ట్ తప్పదా?

తెలంగాణ మోడల్ అభివృద్ధి అంటున్న కేసీఆర్ కరప్షన్ మోడల్ గురించి ఏం చెబుతారంటూ ఇప్పటికే ఆయా పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. నెటిజన్లు సైతం కవిత అంశంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవుతున్నారు. కేంద్రంలోని బీజేపీ బీఆర్ఎస్ ఎదుగుదలని చూసి ఓర్వలేక, మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడుతున్నందునే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని చేస్తున్న ఆరోపణలు రోజు రోజుకు పల్చబడుతున్నాయి. అవినీతి మకిలి నుంచి బయట పడితేనే బీఆర్ఎస్ సచ్చిలత నిరూపితమవుతోంది.

ఏ తప్పు చేయకుంటే అరెస్ట్ వరకు వ్యవహారం ఎందుకు వెళ్తుందని సగటు వ్యక్తి సందేహం కలుగుతోంది. ఇక ఏ ఆప్షన్ లేక పోవడంతోనే తమపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. తాజా అంశాలు రెండు రాష్ట్రాల సీఎంలకు సంకటంగా మారాయి. మరి రానున్న ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది.. లిక్కర్ స్కాం, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులు రెండు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపనున్నాయి అనే అంశాలకు మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

Next Story

Most Viewed