- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పది ఫలితాల్లో సీఎంఆర్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ..
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: పదో తరగతి 2023 పరీక్షా ఫలితాల్లో బోయిన్ పల్లి సీఎంఆర్ హైస్కూల్ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉతీర్ణత సాధించి తమ ప్రతిభను చూపారు. ఈ ఫలితాలలో ఏడుగురు విద్యార్థులు దక్షిత, క్రితి, హజారే, మణిదీప్, జయ్, చక్రవర్తి, ఆదిత్య రాజు, హరిహరన్ లు 10/10 సాధించగా సుమారుగా నలభై శాతం ( 40%) విద్యార్థులు 'ఏ' గ్రేడ్ మార్కులతో ఉతీర్ణత కావడం జరిగింది. ఈ నేపధ్యంలో బోయిన్ పల్లి ప్రాంతానికి చెందిన సీఎంఆర్ పాఠశాల విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, పాఠశాల ఉపాధ్యాయులను మంత్రి మల్లారెడ్డి బోయిన్ పల్లిలోని తన పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని విద్యార్థులకు పుష్ప గుచ్చాలను అందజేసి వారికి మిఠాయి తినిపించి, విద్యార్థులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా 10/10 సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయల నగదును అందజేశారు. రాబోయే రోజులలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమపడి, నిర్దిష్ఠమైన ప్రణాళికలతో విద్యార్థులను అడుగడుగునా ప్రోత్సహిస్తూ వారికి నాణ్యతతో కూడిన విద్య ప్రమాణాలను అందించి పాఠశాల కీర్తి, ప్రతిష్టలు నిలబెట్టిన ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. విద్యార్థుల తల్లి దండ్రులు అంతే శ్రద్ధతో, టీవీలకు, సెల్ ఫోన్ లకు దూరంగా ఉంచి 10/10 సాధించాలన్న లక్ష్యాన్ని కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎస్.కె.రెడ్డి, ప్రిన్సిపాల్ నాగేశ్వర్, వైస్ ప్రిన్సిపాల్ నీలిమ, ఉపాధ్యాయులు తదితరుల పాల్గొన్నారు.