తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా తాహేర్

by Satheesh |   ( Updated:2024-03-01 17:09:45.0  )
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా తాహేర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నిజామాబాద్‌కు చెందిన తాహేర్ బిన్ హమ్దాన్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. తాహేర్ బిన్ హమ్దాన్ ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని రోజులపాటు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు.

తాహేర్ బిన్ హమ్దాన్ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తన స్థానాన్ని త్యాగం చేసినందుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమించినట్లు తెలిసింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి రావడం రెండవసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కామారెడ్డి జిల్లా చెందిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్ పనిచేశారు. తాహేర్‌ను ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమించినందుకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్కులు మైనార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు.

Advertisement

Next Story