లోక్‌సభ టార్గెట్.. కాంగ్రెస్ ‘ఠాగూర్ సీన్’ వ్యూహం

by Disha Web Desk 14 |
లోక్‌సభ టార్గెట్.. కాంగ్రెస్ ‘ఠాగూర్ సీన్’ వ్యూహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి తన పవరేంటో చూపించడానికి సిద్దమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్‌తో ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( మీట్ విత్ చీఫ్ మినిస్టర్) ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్- జూబ్లీహిల్స్‌లోని సీబీఐ కాలని రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి టీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్‌కు లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

"మాకు మీడియానే లేదు. కాంగ్రెస్‌కు పేపర్ లేదు. టీవీ లేదు. మా కార్యకర్తలే మా జర్నలిస్టులు. మా కార్యకర్తలే మా రిపోర్టర్లు. వాళ్లే సోషల్ మీడియాలో ఒకరైదుగురికి ఠాగూర్ సినిమాలో పంపించినట్లుగా ఒకరు ఒక ఐదు మందికి, నాలుగు కోట్ల మందికి చేరేవరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేర్చమని చెబుతున్నాం. వీ‌ఆర్‌ డిపెండింగ్ ఆన్ ఓన్లీ సోషల్ మీడియా " అని రేవంత్ రెడ్డి వీడియోలో పేర్కొన్నారు. దీనిపై అసెంబ్లీలో సత్తాచాటినం అంటే ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేశారా? అని ఓ నెటిజన్ పార్టీని ప్రశ్నించారు.



Next Story

Most Viewed