- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
T-SAT CEO: తెలంగాణలో విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భావి తరాలకు విలువైన విద్యనందించేందుకు, విద్యా ప్రమాణలను మెరుగు పర్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలితో టీ-శాట్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని టీ-శాట్ సీఈవో బి.వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. అధ్యాపకులకు, విద్యార్థులకు సబ్జెక్టులపై నైపుణ్యం పెంచే విధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, చర్చలు, ఆన్ లైన్, ఆఫ్ లైన్ పద్ధతుల్లో బోధనను అందించేందుకు ఒప్పందం జరిగిందన్నారు.
అనంతరం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. టీ-శాట్, ఉన్నత విద్యామండలితో కలిసి ఒప్పందం చేసుకోవడం ద్వారా విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందన్నారు. విద్యార్థుల కోసం సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సు,స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని విశ్వ విద్యాలయాలు టీ-శాట్‌ను ఉపయోగించుకోవాలని వేణుగోపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, వైస్ చైర్మన్ ఎస్ కే మహ్మద్, సెక్రటరీ శ్రీరాం వెంకటేష్ పాల్గొన్నారు.