- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
T Congress: ఒళ్ళు దగ్గర పెట్టుకోని మాట్లాడండి..! బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్(BRS) ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్(Strong Counter) ఇచ్చింది. తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల సోషల్ మీడియాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు కష్టాలు పడుతుంటే నిద్రపోతున్నావా రాహుల్ గాంధీ(Rahul Gandhi) అంటూ బీఆర్ఎస్ చేసిన ట్వీట్(BRS Tweet) కాంగ్రెస్ కౌంటర్(Congress Counter) ట్వీట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా.. దేశ్ కి నేత(Desh Ki Netha) అంటూ దేశ దిమ్మరిలా తిరిగి ఫాంహౌస్(Form House)లో నిద్ర పోతున్నాడా కాపర్ శేఖర్.. పాస్ పోర్టు బ్రోకర్? అని వ్యాఖ్యానించింది. లిక్కర్ దందాల కూతురు అలసి సొలసి ఫాంహౌస్ లో నిద్ర పోతుందా అని, రబ్బరు చెప్పుల అగ్గిపెట్టె, డ్రామా రావు యధావిధిగా వారి వాగుడుతో జనాలను ఆగం పట్టిస్తున్నారని అన్నది. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల్లో బోర్ల పడి, పార్లమెంట్ ఎన్నికల్లో సమాధి అయిన బీఆర్ఎస్ పార్టీలో మిగిలిన చిల్లర వెదవలు ఇలా పొగరుబోతు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టింది.
తెలంగాణ సంపద దోచుకున్న ఓ పంది కొక్కు కలుగులో దాక్కుని కలలు కంటుందా అని, దాన్ని బయటకి తీసుకువచ్చి బోనులో బంధించడం ఖాయమని స్పష్టం చేసింది. అలాగే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) చెప్పినట్టు ఫాంహౌస్ లో ఉన్న ఖాళీ సీసాలు అమ్ముకుని కాలం గడుపుతున్నాడా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అంటూ.. చేసిన అరాచకాలు చాలు అని తిని, తాగి నిద్ర పోతున్నాడా అని నిలదీసింది. కచరాకు స్వతహాగా వచ్చిన ఆస్తులైన అహంకారం, దొర పోకడ, ప్రజలను రెచ్చగొట్టి మంటలు పెట్టి చలి కాచుకోండని కొడుకుకి, అల్లుడికి వారసత్వంగా ఇచ్చి వదిలేశాడని, మా నాయకుడు ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిగా తన విధులను నిర్వర్తిస్తూ, దేశ సమస్యల పై పోరాటం చేస్తున్నాడని తెలిపింది. ఇక బీఆర్ఎస్ ఒళ్ళు దగ్గర పెట్టుకోని మాట్లాడండి, లేదంటే ఇంతకన్నా దారుణంగా మేం కూడా మాట్లాడాల్సి వస్తుంది. జాగ్రత్త! అని హెచ్చరించింది.