గెట్ రెడీ.. తెలంగాణలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: సీఎం సిద్ధరామయ్య

by Satheesh |
గెట్ రెడీ.. తెలంగాణలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: సీఎం సిద్ధరామయ్య
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘డోంట్​వర్రీ.. గెట్​రెడీ, తెలంగాణలోనూ మన జెండానే ఎగురుతుంది. ఎలాంటి టెన్షన్​అవసరం లేదు” అంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య టీ- కాంగ్రెస్​నేతలకు వివరించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండవ సారి బాధ్యతలు తీసుకున్న సిద్ధరామయ్యను బెంగళూర్‌లోని ఆయన నివాసంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు టీమ్​ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపింది.

ఈ సందర్భంగా వీహెచ్​మాట్లాడుతూ.. జూన్‌లో తెలంగాణలో జరగనున్న బీసీ గర్జన సభకు ముఖ్యఅతిథిగా రావాలని ఆయనను కోరామన్నారు. అయితే కర్ణాటక రిజల్ట్స్​తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని సూచించినట్లు వీహెచ్​గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తున్నాయని సిద్ధరామయ్య చెప్పినట్లు వీహెచ్​పేర్కొన్నారు. కార్యకర్తలను కాపాడుకోవాలని, సమస్వయంతో పనిచేస్తే విజయం సులువని కర్ణాటక సీఎం సూచించినట్లు వీహెచ్​స్పష్టం చేశారు.

Advertisement

Next Story