HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్‌పై టీ-కాంగ్రెస్ సీరియస్

by GSrikanth |
HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్‌పై టీ-కాంగ్రెస్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగనున్న ఇండియా vs ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టికెట్ల వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తీరును తప్పబడుతూ మండిపడింది. టికెట్ల సమస్యపై అజారుద్దీన్ స్పందించిన తీరు సరిగా లేదని పేర్కొన్నారు. మ్యాచ్‌కు సంబంధించిన పాసులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వద్దకు ఎన్ని వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. టికెట్ల వ్యవహారంలో హెచ్‌సీఏతో పాటు రాష్ట్ర ప్రభుత్వమూ విఫలం అయిందని విమర్శించారు. కాగా, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story