స్పీడ్ పెంచిన T- కాంగ్రెస్.. బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం

by Satheesh |   ( Updated:2023-07-25 14:32:56.0  )
స్పీడ్ పెంచిన T- కాంగ్రెస్.. బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ‘సెల్పీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్’ అనే కార్యక్రమం చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాంగ్రెస్​పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో గత 50 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామన్నారు. వాట్సాప్, ఫేస్​బుక్, ట్విట్టర్‌లలోనూ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్కీమ్‌లపై పోస్టులు చేయనున్నట్లు వెల్లడించారు.

ఆధునిక కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని అందరికీ తెలిసేలా ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత బీఆర్ఎస్​ప్రభుత్వంలో సీఎం కేసీఆర్​మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రతి సందర్భంలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, తెలంగాణ సమాజన్ని పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. అందుకే జనాలకు నిజాలు తెలిసేందుకు సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. యాబై ఏళ్ల అభివృద్ధిపై ప్రచారం చేస్తూనే.. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు వెల్లడిస్తామన్నారు. ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్​పార్టీదన్నారు.

కాంగ్రెస్​ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కీ మాట్లాడుతూ.. 1999 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, బకాయిల మాఫీ, కొత్త దరఖాస్తూలో 30 రోజుల్లోపే పరిశీలన చేసి పూర్తి చేశామన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మ్యానిఫెస్టో ఉంటుందని, రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా అంశాలు, హామీలను పొందుపరుస్తామన్నారు. అసలు రాష్ట్రంలో మెట్రో రైలు తెచ్చింది కూడా కాంగ్రెస్​పార్టీ అన్నారు. ఔటర్​రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్​పోర్టు, ఈసీఎల్, బీహెచ్‌ఈఎల్, డ్రికింగ్ వాటర్​ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్నారు. వాటన్నింటిని ఎన్నికల లోపు ప్రజలకు గుర్తు చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed