T Congress: అల్లు అర్జున్ ఘనకార్యం చేశాడా..? బండ్రు శోభారాణి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
T Congress: అల్లు అర్జున్ ఘనకార్యం చేశాడా..? బండ్రు శోభారాణి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) ఏమైనా ఘనకార్యం చేశాడా అని, పేదవాళ్లను, ధనికులకు తేడా చూపిస్తున్నారా అని రాష్ట్ర మహిళా కోఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి(Bandru Shobharani) అన్నారు. పుష్ప-2(Pushpa-2) ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్(RTC Cross Roads) సంధ్య థియేటర్(Sandya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన ఆమె.. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారని అన్నారు.

బాలుడు కోమా నుంచి బయటికి తన తల్లి చనిపోయిన విషయం తెలిస్తే ఆ బాలుడి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్(Allu Arjun Arrest) సంఘటన గురించి మాట్లాడుతూ.. ఆయన ఏం ఘనకార్యం చేశాడని సినీ ఇండస్ట్రీ(Movie Industry) మొత్తం ఆయన ఇంటి చుట్టూ క్యూ కడుతున్నారని మండిపడ్డారు. ఆయనను ఎందుకు పరామర్శిస్తున్నారని, ఆయనకు ఉన్నట్లే బాధితులకు కూడా కుటుంబం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక పేదవాళ్లకు, ధనికులకు తేడా చూపిస్తున్నారా అని అడిగారు. అలాగే సినిమా ప్రమోషన్ కోసం ఒక ప్రాణం ఎందుకు బలైపోవాలని, దీనికి ఎవరు కారణం అని ప్రశ్నించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరామని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని శోభారాణి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story