- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూకబ్జా ఆరోపణలే అర్హతగా భావించి టికెట్ ఇచ్చారు.. కాంగ్రెస్ పై బీజేపీ సెటైర్
దిశ, డైనమిక్ బ్యూరో:సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ పై టీ బీజేపీ సెటైర్ వేసింది. ఆయన దానం కాదు 'దాహం' నాగేందర్ అని ఎద్దేవా చేసింది. మంగళవారం ఓ ట్వీట్ చేసిన టీబీజేపీ.. 'దానం నాగేందర్ తమ భూములు కబ్జా చేశారని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని 2 నెలల క్రితం కాంగ్రెస్ ప్రజావాణి వద్ద ప్రజలు ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలనే అర్హత సర్టిఫికెట్లుగా స్వీకరించి కాంగ్రెస్ అతడికి ఎంపీ టికెట్ ఖరారు చేసింది' అంటూ విమర్శలు గుప్పించింది.
కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పై బేగంపేట్, ప్రకాశ్ నగర్ బస్తీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆయన తమ భూములు కబ్జాచేయడమే కాకుండా భూకబ్జాదారులతో కుమ్మక్కై మా బస్తి నుంచి మమ్మల్ని వెళ్లగొట్టి బస్తినీ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఈ చర్యలను మానుకోవాలని ప్రజావాణి ఎదుటా బస్తీ వాసులు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇంతలో దానం నాగేందర్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగా ఆయనకు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కేటాయించారు. అయితే దానం కాంగ్రెస్ లో చేరికను నిరసిస్తూ ప్రకాష్ నగర్ ఎక్స్ టెన్షన్, బేగంపేట్ వాసుల పేరుతో గాంధీభవన్ వద్ద ఇటీవల ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణిలో దానం నాగేందర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వస్తే వాటిపై చర్యలు తీసుకోకుండా అతడికే ఎంపీ టికెట్ కేటాయించడంపై