- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాకేం చేస్తారు..? టీ- బీజేపీ అభ్యర్థులకు సవాల్‌గా మారిన ‘ప్రచారం’
దిశ, తెలంగాణ బ్యూరో: అన్ని పార్టీలదొకదారి.. తమదొక దారి అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఎన్నికలకు కేవలం 25 రోజుల సమయం మాత్రమే మిగిలుంది. అయినా ఇప్పటి వరకు మేనిఫెస్టోపై స్పష్టతనివ్వడంలేదు కమలం పార్టీ అధిష్టానం. ఎన్నికల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రతి పార్టీకి మేనిఫెస్టో ఎంతో కీలకం. పార్టీని గెలిపించాలా? వద్దా? అనేది కూడా మేనిఫెస్టోనే నిర్ణయిస్తుంది. అలాంటి మేనిఫెస్టోపై కాషాయ పార్టీ తాత్సారం వహిస్తోంది.
దీంతో అభ్యర్థులకు ప్రచారం పెద్ద సవాల్‌గా మారింది. ప్రజలు, ఓటర్లను ఏం చెప్పి, ఎలా తమ వైపునకు తిప్పుకోవాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు. కొందరు కమలనాథులు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నా.. అధికారంలోకి వస్తే ఏం చేస్తారని నిలదీతలు మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో వారికి సమాధానం చెప్పలేక నేతలు సతమతమవుతున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు హోరాహోరీగా దూసుకెళ్తున్నాయి. అయితే బీజేపీ మేనిఫెస్టో ఇంకా సిద్ధం కాకపోవడంతో అభ్యర్థులను ప్రకటించిన పలు సెగ్మెంట్లలో ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం గతంలో ప్రవేశపెట్టిన పథకాలనే వారు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికలకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో నేతలు సందిగ్ధంలో పడ్డారు. కేంద్ర ప్రబుత్వం తొమ్మిదేండ్లలో తెలంగాణకు కేటాయించిన నిధులను చెప్పుతూ ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అభ్యర్థులు, పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. మేనిఫెస్టో రిలీజ్ చేయాలని రాష్ట్ర నాయకత్వానికి మొర పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చిందని సంతోషపడాలో.. మేనిఫెస్టో చెప్పకుండా ప్రచారం చేసేదెలా? అని బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నట్లు పలువురు అభ్యర్థులు కుంగిపోతున్నారు. ప్రచారానికి వెళ్లిన ఒకరిద్దరు నేతలకు ఈ విషయంలో చేదు అనుభవం కూడా ఎదురైనట్లు తెలిసింది. తమకోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అందిస్తారో చెప్పాలని, లేదంటే ఎందుకు తమకు ఓటేయాలని నిలదీసినట్లు సమాచారం.
దీంతో కేంద్ర పథకాలను వివరించి అక్కడి నుంచి నేతలు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన చెందుతున్నారు. మేనిఫెస్టోను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర నాయకత్వానికి పలువురు నేతలు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. అయితే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీ మారడంతో పలు మార్పులు చేర్పులు చేసి ప్రకటించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మేనిఫెస్టోను స్టేట్ బీజేపీ ఎప్పుడు ప్రకటించి, అభ్యర్థులకు ప్రచారానికి రూట్ క్లియర్ చేస్తుందనేది తెలియాల్సి ఉంది.