- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఆ పని చేయకపోతే.. KTR అమెరికాలో చిప్పలు కడిగేవాడు: బండి సంజయ్ తీవ్ర విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రోజుకో హత్య, అత్యాచారం జరుగుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రానికి హోం మినిస్టర్ ఉన్నారా అని నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే వారి అంతు చూస్తామని, అఘాయిత్యాలకు పాల్పడిన వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తామని హెచ్చరించారు.
బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన బండి సంజయ్.. తెలంగాణలో మహిళలను చితి మంటలపై పేరుస్తున్న మూర్ఖుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ గుండాలు షర్మిలతో సహ మహిళలను దారుణంగా కించపరుస్తున్నారని మండిపడ్డారు. మహిళలను కించపరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే తన శ్రీమతి సహకారంతోనే సాధ్యమైందన్నారు.
రాష్ట్రంలో మహిళలంటే కేసీఆర్ బిడ్డే అన్నట్లుగా చూపిస్తున్నారని.. నిధులు, పదవులు అన్ని ఆమెకేనా అని ప్రశ్నించారు. కవితకు తప్ప మహిళలకు రాష్ట్రంలో న్యాయం జరగడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలోని ఆడపిల్లలకు కవిత చీడ పురుగులా దాపురించిందని, రాష్ట్రానికే తలవంపులు తెచ్చిందన్నారు. ఉద్యోగులకు జీతాలియ్యడానికే నిధుల్లేవంటున్న కేసీఆర్.. బిడ్డ లిక్కర్ దందాకు వంద కోట్లు ఎక్కడి నుండి వచ్చాయన్నారు.
బీజేపీ మహిళలను రాష్ట్రపతి సహా ఉన్నత పదవుల్లో అవకాశం కల్పిస్తుంటే బీఆర్ఎస్ అవమానిస్తోందని అన్నారు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అంటే కేసీఆర్ అని, బెస్ట్ పర్సన్ ఆఫ్ వరల్డ్ మోడీ అని అన్నారు. కేసీఆర్‌కు సీఎం పదవి బీజేపీ పెట్టిన భిక్షే అన్నారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలుపకుంటే కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగేవాడని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో మహిళా మోర్చాకు టికెట్లు:
గెలిచే సత్తా ఉన్న మహిళా మోర్చా నాయకులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని ఈ బాధ్యత తనదేన్నారు. సామాన్యులను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత బీజేపీదేనని చెప్పారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు సక్సెస్ చేసిన తెలంగాణ కార్యకర్తలను నడ్డా, అమిత్ షా అభినందించారని, ప్రజల్లో ఉండి పార్టీ కోసం మరింత పని చేయాలని సూచించారు. బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళ సమస్యలపై మహిళా మోర్చా నాయకురాళ్లు చేస్తున్న పోరాటాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు.
సీఎం కేసీఆర్ చేతగానితనం వల్ల ప్రీతి మరణిస్తే మహిళా మోర్చా దమ్ము ఏంటో చూపించారని ప్రశంసించారు. అభివృద్ధిపై చర్చించడం చేతకాని కేటీఆర్ ట్విట్టర్‌లో కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్ అంటే కేసీఆర్ కొడుకుకు భయం పట్టుకుందని, కేసీఆర్ కొడుకు పేరును ప్రస్తావించొద్దని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడని అన్నారు. కార్పొరేటర్‌నైన నన్ను అధ్యక్షుడిని చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా, చాయ్ వాలాను ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. బీఆర్ఎస్‌లో ఆ అవకాశం ఉంటుందా? అని ప్రశ్నించారు. హిందూ మతాన్ని, దేవుళ్లను కించపర్చే వాళ్ల తాట తీస్తామని హెచ్చరించారు.
ప్రజా సమస్యలపై కొట్లాడే పార్టీ బీజేపీ అని, ఎన్ని కేసులు పెట్టి అరెస్టులు చేసినా బీజేపీ కార్యకర్తలు ఎదురించి యుద్దం చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని పేదలంతా భావిస్తున్నారని కుటుంబ పాలనను అంతం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్, చింతల రామచంద్రారెడ్డి, జాతీయ కార్యదర్శి పద్మజా మీనన్, నళిని, ఆకుల విజయ, డాక్టర్ పద్మ, కరుణ గోపాల్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.