విషాదం.. పీజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

by GSrikanth |
విషాదం.. పీజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో పీజీ విద్యార్థిని రచనారెడ్డి అనుమానాస్పద మృతిచెందింది. ఉదయం ఓఆర్ఆర్‌పై కారులో అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. కాగా, రచనారెడ్డి బాచుపల్లి మమతా ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story