మాజీ డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

by GSrikanth |
మాజీ డీజీపీ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ అంజనీకుమార్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం తీవ్ర దుమారం రేపింది. ఈ కలయికపై తీవ్రంగా రియాక్ట్ అయిన ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ సస్పెన్షన్‌ వేటు వేసింది. అంతేకాదు.. మహేశ్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. తాజాగా.. సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed