తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం.. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి వర్షాలు..

by Mahesh |   ( Updated:2024-08-21 03:13:12.0  )
తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం.. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రానికి వర్షాలు..
X

దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పోర్లుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలం అయింది. గంటల పాటు కుండపోత వర్షం కురవడంతో వీదులు, ప్రధాన రోడ్లు అన్ని చెరువులను తలపించాయి. దీంతో నగర ప్రజలు ఉద్యోగస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా ఉత్తర తమిళనాడు, ఏపీ, తెలంగాణ లపై ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మెదక్, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలకు సహా మొత్తం 16 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని, అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే రెండు రోజుల నుంచి కురిసిన వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. తాజా వర్ష సూచనలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed