Microsoft vs Google: 'అజూర్'ను దెబ్బకొట్టేందుకు గూగుల్ షాడో క్యాంపెయిన్ నడుపుతోంది.. తీవ్రమైన ఆరోపణలు చేసిన మైక్రోసాఫ్ట్

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-29 17:26:13.0  )
Microsoft vs Google: అజూర్ను దెబ్బకొట్టేందుకు గూగుల్ షాడో క్యాంపెయిన్ నడుపుతోంది.. తీవ్రమైన ఆరోపణలు చేసిన మైక్రోసాఫ్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే రెండు అతిపెద్ద టెక్ దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్(Microsoft), గూగుల్(Google) బహిరంగంగా విమర్శలకు దిగాయి. గూగుల్ తమ క్లౌడ్ బిజినెస్ 'అజూర్(Azure)'ను దెబ్బకొట్టేందుకు 'షాడో క్యాంపెయిన్(Shadow Campaign)' నడుపుతోందని మైక్రోసాఫ్ట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇందుకు యూరోపియన్ కంపెనీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ప్రొవైడర్ల గ్రూప్(CISPG)తో కలిసి తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని తెలిపింది. కాగా యూరప్(Europe)లో మైక్రోసాఫ్ట్ సరైన నిబంధనలు పాటించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్(EU) రెగ్యులేటర్ల వద్ద గూగుల్ యాంటీ ట్రస్ట్ కంప్లైంట్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ అక్రమంగా లైసెన్స్ ప్రాక్టీస్ చేస్తోందని ఆరోపించింది. దీంతో ఈ రెండు కంపెనీల మధ్య అగ్గి రాజేసుకుంది. అయితే ఈ విషయంపై మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ(Rima Alaili) స్పందించారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ దెబ్బతీసేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని, అందుకోసం యూరప్ కంపెనీతో కలిసి వచ్చే వారంలో కొత్త లాబీయింగ్ గ్రూప్(lobbying Group)ను గూగుల్ ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed